Thursday, 15 October 2015

Bruce Lee ------- First Day First Show Updates

Updated at 11:05 PM
మెగా అభిమానులకు పండుగ ట్రీట్ ఇస్తూ సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూనే ఉండండి.
Updated at 11:00 PM
మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చే టైం స్టార్ట్ అయింది. సూపర్బ్ లుక్స్ తో చిరు క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేయబడింది. సినిమా ఒక మంచి సందేశంతో క్లైమాక్స్ కు చేరుతుంది.
Updated at 10:53 PM
కథలో ట్విస్ట్‌లన్నీ రివీల్ అయ్యాయి. సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతోంది.
Updated at 10:48 PM
కథలో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. ప్రస్తుతం ఓ భారీ ఛేజ్ సీన్ వస్తోంది.
Updated at 10:41 PM
ప్రస్తుతం చివరి పాట బ్రూస్ లీ వస్తోంది. కొరియోగ్రఫీ చాలా వైవిధ్యంగా ఉంది.
Updated at 10:30 PM
అలీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల మార్క్ కామెడీ సన్నివేశాలు కొన్ని వస్తున్నాయి.
Updated at 10:28 PM
నదియా, బ్రహ్మానందంల మధ్యన ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. జబర్దస్త్ కామెడీ టీమ్‌ కూడా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Updated at 10:20 PM
ప్రస్తుతం కొన్ని ఆసక్తికర కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Updated at 10:14 PM
ఇప్పుడే కథలోకి బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చాడు. సినిమా కామెడీ వైపు మళ్ళింది.
Updated at 10:10 PM
బాలీవుడ్ నటి టిస్కా చోప్రా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Updated at 10:05 PM
ప్రస్తుతం 'లే చలో' అనే రొమాంటిక్ సాంగ్ వస్తోంది. విజువల్స్ చాలా బాగున్నాయి. రకుల్ ప్రీత్ కట్టిపడేసేలా ఉంది.
Updated at 09:50 PM
ఇంటర్వెల్ తర్వాత ఇప్పుడే ముఖేష్ రుషి ఎంట్రీ ఇచ్చాడు.
Updated at 09:36 PM
ఓ అద్భుతమైన ట్విస్ట్‌తో సినిమా ఇంటర్వెల్‌కు దగ్గరైంది. ఇంటర్వెల్.
Updated at 09:29 PM
సినిమా ఇంటర్వెల్ దిశగా వెళుతోంది.
Updated at 09:27 PM
సినిమాలో ఓ బలమైన ఎమోషనల్ ట్విస్ట్ ఇప్పుడే వచ్చింది. చరణ్, అరుణ్ విజయ్‌ల నేపథ్యంలో ఇంటెన్స్ సన్నివేశాలు వస్తున్నాయి.
Updated at 09:23 PM
ప్రస్తుతం మూడో పాట మెగా మీటర్ వస్తోంది. థమన్ మాస్ నంబర్ మాస్‌కి కిక్కించేలా ఉంది. పిక్చరైజేషన్ కూడా మాసీగా ఉంది.
Updated at 09:17 PM
కథలో ఇప్పుడే చిన్న ట్విస్ట్ మొదలైంది. ప్రస్తుతం ఓ ఫైట్ సీన్ వస్తోంది. జయప్రకాష్ రెడ్డి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Updated at 09:07 PM
ప్రస్తుతం రెండో పాట రియా రియా వస్తోంది. రకుల్ ప్రీత్ ఈ పాటలో చాలా అందంగా ఉంది.
Updated at 09:05 PM
రామ్ చరణ్, రకుల్ ప్రీత్‌ల నేపథ్యంలో పలు సరదా రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి.
Updated at 08:54 PM
మెయిన్ విలన్‍ దీపక్ రాజ్‌గా అరుణ్ విజయ్ ఇప్పుడే ఓ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు.
Updated at 08:44 PM
చరణ్ అక్కగా కృతి కర్బంధ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. సప్తగిరి కూడా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Updated at 08:38 PM
ప్రస్తుతం రామ్ చరణ్ ఎంట్రీ సాంగ్ 'రన్' వస్తోంది. చెర్రీ డ్యాన్సులు అదిరిపోయేలా ఉన్నాయి.
Updated at 08:32 PM
ఓ సూపర్ ఫైట్‌తో రామ్ చరణ్ ఇప్పుడే స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు.
Updated at 08:28 PM
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడే సింపుల్ ఎంట్రీ ఇచ్చింది.
Updated at 08:26 PM
సినిమా ఫ్లాష్‌బ్యాక్ మోడ్‌లో మొదలైంది. రావు రమేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.
Updated at 08:22 PM
బ్రూస్ లీ సినిమాకు సంబంధించిన నటీనటులతో పాటు టాలీవుడ్‌ యువ హీరోలు, సినీ ప్రముఖులు స్పెషల్ ప్రీమియర్‌కు విచ్చేశారు.
Updated at 08:20 PM
153 నిమిషాల నిడివి గల బ్రూస్ లీ సినిమా ఇప్పుడే మొదలైంది.